పశువుల్లో గజ్జి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-

భారతదేశంలో.. వ్యవసాయం తర్వాత.. ఎంతోమందికి జీవనోపాధి పాడిపరిశ్రమే. సాధారణంగా.. చదువుకోని వాళ్లే.. ఈ పనులు చేస్తుంటారు. పశువులను పెంచడం అంటే.. నీళ్లుపెట్టడం, మేతవేయడం, పాలు పితుక్కోవడం మాత్రమే కాదు.. పాడిపరిశ్రమపై మంచి అవగాహన ఉంటే..ఇదే నెంబర్ వన్ బిజినెస్ అవుతుంది. ఒకప్పుడు చదువకోకపోతే గేదెలు కాసుకోవాల్సి వస్తుంది అనేవాళ్లు.. ఇప్పుడు గేదెలు కాసుకోవడానికే.. చదివే కోర్సులు ఉన్నాయి. పాడిపరిశ్రమకు టెక్నాలజీ, విషయపరిజ్ఞానం తోడైతే లాభాలపంటే. నేడు పశువుల యజమానులకు వాటి పోషణ, ఆరోగ్యంపై సరైన అవగాహన లేక.. అశ్రద్ధగా వహిస్తున్నారు. కొన్నిసార్లు పశువులు ప్రాణాలు పోయే వరకూ వస్తుంది. పశువుల్లో రింగ్‌వార్మ్, దురద, పేను వంటి సమస్యలు వచ్చినా పట్టించుకోరు. దీని కారణంగా ఈ జంతువులు వ్యాధి బారిన పడతాయి. ఈరోజు మనం వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
గజ్జి వ్యాధి అనేది జంతువులలో అధికంగా వస్తుంది. దీని కారణంగా పశువులు బలహీనంగా మారతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి తక్కువ ఉన్న సందర్భంలో సరైన చికిత్సను అందించినట్లైతే వెంటనే దాని నుండి పశువును రక్షించుకోవచ్చు. గజ్జి వ్యాధి వచ్చిన సందర్భంలో పశువు చర్మం కోల్పోవడం ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. దురద, జుట్టు రాలడం, ఆకలిని కోల్పోవటం వంటివి జరుగుతాయి.

ఇవి రావడానికి ప్రధాన కారణాలు..

ఈ జబ్బురావటానికి కారణం పశువుల చుట్టూ ఉండే మురికి. అందుకే పశువులను ఉంచే ప్రదేశాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. జంతువుల పేడ, మూత్రం వంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. శుభ్రపరిచే సమయంలో 5 గ్రాముల రెడ్ మెడిసిన్ లేదా 50 మిల్లీలీటర్ల ఫినైల్ కలిపి పశువలకొట్టంలో స్ప్రేచేయాలి. దీని వల్ల పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. సంవత్సరానికి ఒకసారి యాంటెల్మింటిక్ ఔషదాన్ని వాడుకోవాలి. అంటు వ్యాధులపట్ల అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలతోపాటు వ్యాధి సోకిందని తెలియగానే చికిత్స చేయించటం మంచిది. పశువుల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి. గడ్డితోపాటు.. దాణాకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ములగ ఆకు దాణా వల్ల పశువలకు పాలదిగబడి పెరుగుతుంది. ఇంకా ఇలాంటివి దాణ చెక్కలను పశువలకు ఇవ్వడం వల్ల బాగా ఆరోగ్యంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...