మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు..!!

-

మనదేశంలో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి..ఈ పంటను రైతులు యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యలలో కత్తెర పురుగు ముఖ్యమైనది. ఈ పురుగు ఆశించడం వలన రైతులు, దీని ఉదృతి ఎక్కువైనప్పుడు నష్టపోయే అవకాశం ఉన్నందున ముందే ఈ పురుగులను గుర్తించి వాటికి నివారణ చర్యలు తీసుకోవడం మంచిది.. అప్పుడే మంచి దిగుబడి పొందవచ్చు..

రైతులు మొక్కజొన్నలో కత్తెరపురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు.. సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై రైతు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. మొక్కజొన్న విత్తనాన్ని ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలని విత్తిన 20– 25 రోజులకు కూడా పురుగు ఆశిస్తే నివారించుకోవచ్చునన్నారు. ఈ కత్తెర పురుగు నివారణకు పది వేలు పీపీఎం అనే వేపనూనెను 200 ఎంఎల్‌ ఎకరానికి పిచికారీ చేసుకోవాలన్నారు.

పంట వేసిన 15, 25 రోజుల దశలలో ఉందని తెలిపారు. ఈదశలో పురుగులు పంటను ఎక్కువ ఆశించి నష్టం చేస్తాయన్నారు. ఈ దశలో రైతులు మొక్కలను జాగ్రత్తగ కాపాడాలన్నారు. ప్రస్తుతం పొగాకు లద్ది పురుగు ఆశించిందని, ఇది ఆకులను తినడం వలన ఆకులు వలయాకారంలో ఉండి సూర్యరశ్మి తీసుకోకుండా మొక్కచనిపోతుందని తెలిపారు. దీనినివారణకు డెలిగేట్‌ మందు 100 మి.లీ. పిచికారి చెయ్యాలని చెబుతున్నారు..

అయితే, విత్తడానికి ముందు ట్రాక్టర్‌ తో లేక ఎడ్లనాగలితో లోతైన దుక్కి చేసుకోవాలి. దీని వల్ల నెలలోని కత్తెర పురుగు నిద్రావస్థ దశ అయిన ప్యుపాలు సూర్యరశ్మి బారిన పడి చనిపోతాయి. లేదా పక్షులు ఆశించి తినటం వల్ల పురుగు ఉధృతి పైరుపై చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్యూపా నుంచి వచ్చే ఒక్కొక్క తల్లి పురుగు 1500 నుంచి 2000 గుడ్లు పెట్టే అవకాశం ఉన్నది. ప్యుపాలను నాశనం చేయటం ద్వారా వీటిని నివారించవచ్చు. అలాగే వర్షపు నీరు ఎక్కువగా ఇంకి పైరు బెట్టకు త్వరగా రాకుండా కాపాడుతుంది.విత్తనాన్ని ముందుగా సేకరించుకొని, విత్తుటకు 24 గంటల ముందు సయంట్రానిలి ప్రోల్‌ంథయామిథాక్సమ్‌ కేజి మొక్కజొన్న విత్తనానికి 4 మి.లీ. చొప్పున విత్తనశుద్ధి చేసుకోవాలి.. అలా చెయ్యడం వల్ల పురుగు ఉదృతి తగ్గుతుంది.. ఇంకేదైనా సమాచారం కావాలనుకుంటే వ్యవసాయ నిపుణుల సంప్రదించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news