మినుము పంటలో కలుపు నివారణ ఎలా అంటే..?

-

చాలా మంది రైతులు మినుములు కూడా పండిస్తూ ఉంటారు. వరి పంట పూర్తయ్యాక మినుము, పెసర లాంటి చిరుధాన్యాలని పండిస్తూ ఉంటారు. అయితే మినుము పంట కి ఎక్కువ నీరు అవసరం. వర్షపు నీటితో ఈ పంట పండుతుంది. అలానే ఈ పంటలు పండించాలంటే ఎక్కువ పెట్టుబడి అక్కర్లేదు. పైగా శ్రమ కూడా తక్కువే. ఎక్కువ ఆదాయాన్ని మినుము తీసుకు వస్తుంది.

అందుకే చాలా మంది రైతులు దీన్ని పండించడానికి ఇష్టపడతారు. అయితే మినుము పంట లో కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటోంది. కలుపు మొక్కలు కారణంగా పంట ఎదుగుదల నాశనమవుతుంది. దీంతో ఎక్కువ దిగుబడి రాకుండా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మినుము పంట కి కలుపు నివారణ చాలా ముఖ్యం. అయితే కలుపుని ఎలా తొలగించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

మినుము పంటలో కలుపుని తొలగించాలంటే విత్తుటకు ముందు ప్లూక్టోరాలిస్ 45% ద్రావకం ఎకరాకు 1 లీటరు చొప్పున భూమిపై పిచికారి చేసి గుంటకతో పై పైన కలియదున్నాలి. ఇలా చేస్తే కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి. దీనితో పంటకి నష్టం ఉండదు.

అలానే కలుపుని ఈజీగా తొలగించచ్చు. లేదు అంటే పె౦డిమిథాలిస్ 30% ద్రావకం ఎకరాకు 1.3 ను౦డి 1.6 లీటరు చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున పిచికారి చేయాలి. అదే మాగాణి పంట కి అయితే ఫెనాక్సోపాప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మి-లి- లేదా క్యేజలాసాప్ ఇథైల్ 5 శాత౦ ద్రావకం ఎకరాకు 400 మి.లి చొప్పున ఏదొ ఒక దానిని 200 లిటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులకి పిచికారి చేయాలి. ఇలా ఈ విధంగా రైతులు అనుసరిస్తే ఎలాంటి నష్టం వాటిల్లదు. అలానే ఏ సమస్య లేకుండా పంటని చక్కగా పండించుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news