వరి నారును పెంచడంలో మెళకువలు..

-

మన రాష్ట్రాలలో సాగు చేసే ప్రధాన పంట వరి.. పెరుగుతున్న జనాభాకు ఆహారం, పశువులకు మేత మరియు గ్రామీణ ప్రజలకు ఉపాధిని అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో 22 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే ప్రధాన పంట వరి..ఏపీలో 13 జిల్లాలు వరి పంటను ఉత్పత్తి చేస్తున్నాయి, వీటిలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం మరియు చిత్తూరు ప్రధాన ఉత్పత్తిదారులు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి,కృష్ణా మూడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే మూడు ముఖ్యమైన వరిని ఉత్పత్తి చేసే జిల్లాలు.పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పరిగణించబడతాయి.

నారుమడి పెంపకం..

నారుమడి కోసం ముందుగా  2-3 సార్లు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేస్తే మంచిది. 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. పశువుల పేడను లేదా సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది.మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా నీరు ఉంచాలి.జింకు లోపం కు లీటరు నీటికి 2గ్రా., జింకు సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి..

నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి . నారు పీకే వారం రోజుల ముందు గుంట నారుమడికి 400గ్రా., కార్బోప్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి నారుమడి మొత్తం చల్లి ఒకసారి నీరు పెట్టాలి.రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి..అందుకే తామర పురుగులను నివారించాలి.బ్యూటాక్లోర్ లేదా ప్రెటిలాక్లోర్ 25 మి.లీ. ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చెయ్యాలి..ఇలాంటి మెలుకువలు తీసుకుంటే మాత్రం వరి పంటకు వచ్చే తెగుల్లు రాకుండా ఉంటాయి.. ఇంకా పూర్తీ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news