అంటు మొక్కలు నాటే సమయంలో రైతులు తీలుసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

ఈరోజుల్లో మొక్కలను పెంచడం అందరూ హాబిగా పెట్టుకున్నారు..అదే ఆదాయం రావడంతో పంటలను వేస్తున్నారు. దాన్నే హార్టికల్చర్ ఉద్యానవనంలో నాణ్యమైన విత్తనాలు, పండ్లు మరియు పువ్వులు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విభిన్నమైన నేలలు మరియు వాతావరణాలతో మన దేశంలో అనేక రకాల వ్యవసాయ-పర్యావరణాలు ఉన్నాయి, ఇది వివిధ రకాల ఉద్యానవనాలు మరియు పంటలను పండించడానికి అవకాశాన్ని అందిస్తుంది. హైటెక్ గ్రీన్హౌస్లు, అంతర్గత పరిశోధనలు మరియు ఆఫ్-సీజన్ వ్యవసాయం ఉద్యానవన రంగంలో కొత్త అవకాశాలను తెరిచాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే పండ్లు మరియు కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి..

తీసుకొవాల్సిన జాగ్రత్తలు..

గుంతలు త్రవ్వుట మరియు గుంతలు నింపుట..
ఏప్రిల్ – మే మాసాలలో గుర్తించిన ప్రదేశాలలో 1మీ. పొడవు 1.మీ. వెడల్పు 1 మీ. లోతు గుంతలు త్రవ్వాలి. వర్షాకాలంలో మురుగు నీరు నిలిచే ప్రాంతాల్లో అక్టోబరు – నవంబర మాసాల్లో నాటాలి..

అలాగే గుంతలు త్రవ్వగా వచ్చిన మట్టిని మట్టి కి, అంటే ఒక పాలు మట్టికి, ఒక పాలు పశువులు ఎరువు, బంకనేల అయితే ఒక పాలు సన్నని యిసుక, 2 కిలోల వేపపిండి, కిలో సూపర్ ఫాస్పేట్, 100 గ్రా. లిండేన్ పొడి మందు వేసి గుంతలు నింపాలి..

మొక్కలను నాటే విధానం:

*.  వర్షపాతం తక్కువగా ఉన్న నేలల్లో ముందే మొక్కలు నాటాలి.

*. ప్లాంటింగు బోర్డును ఉపయోగించి ఖచ్చితంగా సరళ రేఖలో ఉండేలా నాటాలి.

*. సాయంత్రం వేళలో నాటాలి.
*. మొక్క/ అంటు మొక్కలు భూమిలో ఎంత వరకు కప్పబడి ఉందో అంత లోతు వరకే పాతాలి.
*. అంటు మొక్కలలో గ్రాఫ్ట్ జాయింట్ నేలలోకి పోకుండా చూడాలి.
*. దృఢమైన కట్టెను ఊతంగా పాతాలి.
*. నాటిన తర్వాత మొక్క చుట్టూ మట్టిని బాగా అదిమి కూరాలి.
*. వేరు భాగం నుండి పెరిగే కొమ్మలను తొలగిస్తూ ఉండాలి.
*.అవసరమైన దానికంటే 10% మొక్కలు ఎక్కువ తెచ్చి పెట్టి నీడలో ఉంచి నీరు చల్లుతూ ఉండాలి. మొదటి 2-3 నెలలో చనిపోయే మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు నాటితే అన్ని మొక్కలు ఒకేసారి పెరుగుతాయి…కోత కూడా వస్తుంది.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..ఇంకేదైనా సందెహాలు ఉంటే వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version