బొప్పాయి సాగులో అనువైన రకాలు..తెగుళ్ల నివారణ చర్యలు..

-

బొప్పాయి పంట వేసవి పంట..ఎక్కువ ఉష్ణోగ్రత లో కూడా పండుతుంది.సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం.వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. బొప్పాయి సాగుకు సంబంధించి రైతులు వివిధ రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. అందులో డైయోషియస్‌కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్‌హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి.

 

 

 

గైనోడయోసియస్‌కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. అయితే రైతులు అధికంగా తైవాన్ రెడ్ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేసేందుకు రైతులకు ఆసక్తి చూపుతున్నారు.పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. ఈ లోపుగా మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది..అప్పుడే పంటకు మేలు చేస్తుంది..

చెట్టు నాటే ముందు గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క ఎదుగుతున్న కొద్ది అనుగుణంగా యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల పశువుల ఎరువును కూడా వాడాలి..

బొప్పాయి వచ్చే తెగుల్లు మరియు నివారణ చర్యలు..

కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. ఈ నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్ లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. వారానికి రెండుసార్లు పిచికారి చేయాలి..

ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను నియంత్రించవచ్చు..

కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా10 కిలోల వేపపిండి, కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయటం వల్ల తెగులు నుండి మొక్కలను రక్షించుకోవచ్చు.

ఆకు పచ్చ తెగుల్లు, పండు ఈగ సమస్యలు వస్తాయి. వీటికి వెంటనే మందులను పిచికారి చెయ్యాలి..ఇంకేదైనా సమస్యలు ఉంటే వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news