జామకాయ తింటే ముడతల సమస్య రాదా..! ఈ విషయాలు తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!

-

సీజనల్ ఫ్రూట్స్ లో జామకాయ కూడా ఒకటి. ఈ శీతాకాలంలో బాగా దొరుకుతుంది. చిన్నప్పుడు అయితే..బడిబయట జామకాయల సైకిల్ తో ఒక అంకుల్ ఉండేవాడు..మనలో చాలామంది లంచ్ బ్రేక్ లో జామకాయలు కొనుక్కోని..అందులో ఉప్పుకారం రాయించుకుని..ఒక కాయలోని ముక్కలోనే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని అలా తినుకుంటూ బ్రేక్ టైం ఎంజాయ్ చేసేవాళ్లం కదా..ఇప్పుడు అంతా మారిపోయింది. కానీ జామకాయలోని పోషకవిలువలు మాత్రం అలానే ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది చక్కటి పరిష్కారమట. జామకాయలే కాకుండా ఆకులు కూడా దివ్య ఔషధంలో పనిచేస్తాయి. జామపండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ముడతలు పడిన చర్మాన్ని బిగుతుగా చేయడంలో జామకాయ చక్కగా సహాయపడుతుంది.

జామపండులో నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం ఎక్స్‌ పోలియేట్‌ కాకుండా కాపాడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. జామ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో జామపండు ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారికి జామ ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. రోజు ఒక జామపండు తినటం మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎక్కువగా మాత్రం షుగర్ పేషంట్స్ తినకూడదు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువును నియంత్రించడంలో జామకాయ చక్కగా సహయపడుతుంది. అలాగే పండును తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.

రోగ నిరోధక శక్తిని పెంచటంలోనూ జామకాయ బాగా దోహదపడుతుంది. ఈరోజుల్లో ఇమ్యునిటీ పవర్ ఎంత ఉపయోగం మనకు బాగా తెలుసు.. జామలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి.. జామపండు శక్తిని కూడా ఇస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇతర పండ్ల కంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జామ గింజలు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత ఒక జామకాయ తింటే..త్వరగా జీర్ణక్రియ అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇన్ని లాభాలు ఉన్న జామకాయలు ఈ శీతాకాలంలో బాగా దొరుకుతాయి కాబట్టి లాగించేయండి మరీ. వీటి ధర కూడా అంత ఎక్కువే ఉండదు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news