శిరోజాల అందానికి కావాల్సిన పదార్థాలు మీ వంటింట్లోనే ఉన్నాయని మీకు తెలుసా..?

-

అమ్మాయిల అందానికి మరింత వన్నె తీసుకొచ్చేవి వాళ్ల కురులే. కురులు విరగబోసుకున్నప్పుడు ఒకలా, కుప్పగా ఒకే దగ్గర పెట్టినపుడు మరోలా, ముంగురులు మీద పడుతున్నప్పుడు ఇంకోలా చాలా అందంగా కనిపిస్తారు. అందుకే వారు వారి శిరోజాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఐతే ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయస్సులోనే కురులు వాటి అందాలని కోల్పోతున్నాయి. కాలుష్యమో, తినే ఆహారంలో లోపమో ఏమో కానీ తొందరగా తెల్లబడటమో, లేదా చిక్కులు చిక్కులుగా ఊడిపోవడమో జరిగి వాటి నిగనిగల్ని కోల్పోతున్నాయి.

మరి దీని నుండి బయటపడడానికి మనకి చాలా మార్గాలున్నాయి. మన వంటింట్లో ఉండే పదార్థాలే శిరోజాలని అందంగా మార్చే సాధనాలుగా పనిచేస్తాయి. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

కొబ్బరి నూనె..

సాధారణంగా ప్రతీ ఇళ్ళల్లో కొబ్బరి నూనె వాడతారు. కొబ్బరి నూనె శిరోజాల అందానికి బాగా పనిచేస్తుంది. ఐతే కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు కలుపుకుని మరిగించి వడపోసి తలకి మర్దన చేసుకుంటే శిరోజాలు చాలా మృదువుగా తయారవుతాయి.

కలబంద..

కలబందని తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు, తేనే, ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకి పెట్టుకుని 20నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. దీనివల్ల కురులు మరింత అందంగా, మృదువుగా కనిపిస్తాయి.

గుడ్డు..

గుడ్డులో ఉండే విటమిన్లు కేశాలకి చాలా రక్షణనిస్తాయి. గుడ్డులోని పచ్చ సొనలని తీసుకుని వాటికి కొద్దిగా వెన్న, ఆలివ్ ఆయిల్ కలిపి పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కేశాలకి పట్టిస్తే కేశాలు మృదువుగా అవుతాయి. ఇంకా చుండ్రు కూడా తగ్గిపోతుంది. అప్పుడు మీరు మరింత అందంగా కనిపిస్తారు.

సో.. ఇవండీ మీ కేశాల ఆరోగ్యానికి మీ వంటింట్లోనే ఉండే పదార్థాలు.

Read more RELATED
Recommended to you

Latest news