జుట్టుని తేమగా మెరిసేలా చేయడానికి అవొకోడో చేసే మేలు తెలుసుకోండి..

-

జుట్టు సంరక్షణకి చాలా నివారణలు ఉన్నాయి. పొడిగా ఉన్న జుట్టుని తేమగా మెరిసేలా చేయడానికి అవొకొడో బాగా పనిచేస్తుంది. అవొకొడోలో చాలా పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి, సి, ఈ పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవొకోడో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్లు జుట్టును తేమగా ఉంచడానికి సహకరిస్తాయి. దానివల్ల జుట్టు మెరిసేలా తయారవుతుంది. ప్రస్తుతం అవొకొడోతో జుట్టుని ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.

అవొకోడో వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు

స్టైలింగ్, వేడి కారణంగా జుట్టు విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఉండడానికి అవొకోడోలోని నూనె బాగా పనిచేస్తుంది. అవొకొడో నూనెని క్రమం తప్పకుండా జుట్టుకి అప్లై చేస్తూ ఉంటే జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. అంతేకాదు నూనె కారణంగా జుట్టుకి తేమ వచ్చి మెరిసేలా అవుతుంది. ఇంకా, జుట్టు పొడవు పెరుగుతుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. విటమిన్ బి, ఈ సరిగ్గా అందడం వల్ల మృదువుగా ఉంటుంది.

అవొకొడోలో ఉండే అమైనో ఆమ్లాలు చుండ్రు రాకుండా కాపాడతాయి. చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే అవొకొడో ని వాడి చూడండి. కొద్ది రోజుల్లోనే చుండ్రు నుండి ఉపశమనం పొందుతారు.

అవొకొడో హెయిర్ మాస్క్

అవొకొడోని గుజ్జుగా చేసి రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెని కలపాలి.

తర్వాత ఆ గుజ్జుని తీసుకుని మునివేళ్లతో దాదాపు పది నిమిషాల పాటు జుట్టుకి మర్దన చేయాలి.

అవొకొడో, కలబంద

అవొకొడో రెండు స్పూన్లు, కలబంద రసం రెండు స్పూన్లు, కొంత కొబ్బరి నూనె మిక్స్ చేసి నెత్తిమీద మర్దన చేయండి.

అవొకొడో, ఓట్ మీల్ హెయిర్ మాస్క్

దీనికోసం ఓట్ మీల్ ని బాగా ఉడికించి చల్లబరచాలి, అప్పుడు అవొకొడో గుజ్జుని తీసుకుని రెండింటినీ మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని జుట్టికి బాగా రాయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version