పిగ్మెంటేషన్ సమస్యకు చింతగింజల పొడి సూపర్ సొల్యూషన్.. సైంటిఫిక్ గా ఇదే చెప్పారండీ.!

-

ఈ రోజుల్లో చాలామంది హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖం పై వచ్చే మంగు మచ్చలను తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఖరీదైన మందులు వాడి సమస్యను తగ్గించుకోవచ్చేమో కానీ.. శాశ్వతంగా పరిష్కారం ఉండటం లేదు. నాచురల్గా మంగుమచ్చలను తగ్గించుకోవడానికి చింతగింజలు ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా నిరూపించారు తెలుసా..? ఈరోజు మనం ఈ గింజలు ఎలా ఉపయోగపడుతున్నాయి, వీటిని ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం.

 

చింతకాయ ఈ పేరు విన్నా, చింతకాయలు చూసినా నోట్లో నీళ్లు ఊరిపోతాయి. పల్లెటూర్లలో చింతకాయలు కొట్టుకుని తెగ తినేవాళ్లం కదా.. చింతగింజలతో రోటిపచ్చడి కూడా చేసేవాళ్లు. పూర్వం రోజుల్లో చాలామంది చింతగింజలను కూడా ఉపయోగించారు. కానీ మనకు పెద్దగా తెలియదు. చింతగింజల్లో ప్రధానంగా ప్రోయాంథోసైనడిన్( Proanthocyanidin) , ఏపిక్ కాటజిన్స్( Epic Castagne) అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి నలుపువర్ణాన్ని ఉత్పత్తిచేసే కణజాలంలో మార్పులు తీసుకురావడానికి బాగా ఉపయోగపడతాయి.

చర్మంలోపల భాగంలో మెలనిన్ అనే నలుపువరణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం ఉంటుంది.. దాన్నే మెలనోసైట్స్( Melanocytes)అంటారు. ఇవి నలుపువర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి.మన జుట్టు నల్లగా ఉండాలంటే.. ఇది ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. అయితే ఇది ఫేస్ మీద ప్రొడ్యూస్ అయితే.. ముఖం మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఎండల్లో తిరిగినప్పుడు సహజంగా మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది.

 

చింతగింజల పొడి పిగ్మెంటేషన్ సమస్యకు ఎలా ఉపయోగపడుతుందంటే.. ఈ పొడిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మెలనోసైట్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయకుండా కంట్రోల్ చేస్తుందని సైంటిస్టులు 2012వ సంవత్సంరలో కాస్మోటిక్స్ అండ్ నాచురల్ ప్రొడెక్ట్స్ రీసర్చ్ సెంటర్( Cosmetics and Natural Products Research Center- Thailand) వారు పరిశోధన చేసి కనుగొన్నారు.

ఎలా వాడుకోవాలంటే..?

100ML నీళ్లు తీసుకుని అందులో చింతగింజల పొడి కలుపుకుని కూడా తాగేయొచ్చు. పాలల్లో కూడా కలుపుకుని తాగొచ్చు. పిగ్మెంటేషన్ కు ఎలా వాడాలంటే.. చింతగింజలను సానరాయి తీసుకుని తేనెతో రంగరిస్తే.. మెత్తగా పేస్టు వస్తుంది. ఈ పేస్టును పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసుకోవాలి. చింతగింజల పొడికి తేనె కలుపుని నాకేయొచ్చు. ఇది ఇంకా ఈజీ. మీకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు. బాహ్యంగా అప్లై చేస్తూ.. అరగంట ఉంచుకుని క్లీన్ చేసుకుంటూ.. పైన చెప్పినట్లు వాటర్ లో లేదా తేనెతో లోపలకి తీసుకుంటుంటే.. ఒక్క పిగ్మెంటేషన్ సమస్యే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

చింతగింజల పొడి కీళ్ల నొప్పులు, డ‌యేరియా, దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణంవంటి అనేక రోగాలను నయం చేస్తుంది. ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు వీరిని ప్ర‌దేశంపై రోజూ చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి. మీకు తెలుసో లేదో.. కొన్ని బిస్కట్ ల తయారీలో కూడా చింతగింజల పొడని వాడతారు. ఇంట్లో ఏదైనా డెకరెషన్ చేయాలన్నా, బయట సినిమా పోస్టర్లు అంటించాలన్నా ఇప్పుడు మైదా పిండి వాడుతున్నారు.. కానీ ఒకప్పుడు చింతగింజల పిండితో చేసిన జిగురునే వాడేవాళ్లు తెలుసా.

చింతగింజల పొడితో.. అందం ఆరోగ్యం రెండు మీ సొంతం.. సైంటిఫిక్ గా కూడా పిగ్మెంటేషన్ కు ఇది ఉపయోగపడుతుందని తెలిసింది కాబట్టి.. ఓ సారి ట్రై చేసి చూడండి. ఖర్చులేని పని. మనం వాడే చింతపండులో ఎలాగూ గింజలు ఉంటాయి.. అ‌వి తీసి ఎండపెట్టుకుని పొడి చేసుకోవచ్చు లేదా.. సర్జికల్ షాపుల్లో ఒక ప్యాకెట్ తెచ్చుకుని వాడుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news