బిజినెస్ ఐడియా: కంపోస్ట్ తో కూడా చక్కటి లాభాలు..!

-

చాలా మంది వ్యాపారాలని చేయడానికి చూస్తున్నారు మీరు కూడా ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అయితే చక్కగా డబ్బులు వస్తాయి. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో రసాయనాలు లేని ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు.

ఆర్గానిక్ ఫుడ్ కి డిమాండ్ బాగా పెరిగింది కనుక కంపోస్టు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఇక ఈ బిజినెస్ ని ఎలా చేయాలి..? ఎలా లాభాలను పొందొచ్చు అనేది చూసేద్దాం. అరటి కాండాన్ని ఉపయోగించి మీరు బిజినెస్ ని చేయాల్సి ఉంటుంది. అరటి కాండం పనికిరాదు కాబట్టి దానిని మీరు తక్కువ డబ్బులకి కొనుగోలు చెయ్యచ్చు లేదంటే ఫ్రీగా కూడా మీరు దానిని పొందొచ్చు. రైతులు వీటిని పడేస్తారు కాబట్టి మీరు వాటిని అడిగి తీసుకోవచ్చు దీనిని మీరు సేంద్రియ ఎరువు కింద మార్చుకోవచ్చు. మొదట మీరు ఒక గొయ్యను తీసి అందులో అరటి కాండాన్ని వేయాలి తర్వాత ఆవు పేడ కలుపు మొక్కలు వంటివి వేయాలి.

దీనిలో మీరు డికంపోజర్ ని కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇలా ఇవన్నీ కలిపి సేంద్రియ ఎరువుగా మారతాయి. పంటలు బాగా పండడానికి రైతులు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లోకి మీరు దీన్ని తీసుకువెళ్లి విక్రయించొచ్చు. లాభాలు ఎక్కువగానే వస్తాయి ఖర్చు తక్కువగా వుంటుంది. సేంద్రియ ఎరువు తయారీకి ఎక్కువ ఖర్చు ఉండదు. కానీ లాభాలు బాగానే వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువు వాడేలా ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇది ఎలా తయారు చేయాలి అనేది శిక్షణ కూడా ఇస్తున్నారు. దీన్ని వాడితే నేల యొక్క సారవంతమైన శక్తిని కాపాడుకోవడానికి అవుతుంది అలానే కెమికల్స్ లేని పంటను కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news