బిజినెస్ ఐడియా: పుట్టగొడుగులతో అదిరే లాభాలు..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వ్యాపారాల పైన దృష్టి పెడుతున్నారు మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా లాభాలు వస్తాయి. పైగా ఎటువంటి రిస్కు కూడా ఉండదు. చక్కటి ఆదాయాన్ని ఈ వ్యాపారం ద్వారా పొందవచ్చు.

అదే పుట్టగొడుగుల బిజినెస్. పుట్టగొడుగులని పెంచి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఇంట్లో కూర్చుని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలా మంది పౌష్టిక ఆహారం మీద దృష్టి పెడుతున్నారు. అందరూ మాంసాహారాన్ని మానేసి శాకాహారాన్ని తింటున్నారు దాంతో పుట్టగొడికి డిమాండ్ పెరిగిపోయింది. శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు పుట్టగొడుగుల ద్వారా మనం పొందవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు.

కేవలం 5000 రూపాయలు ఉంటే సరిపోతుంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో పుట్టగొడుగు సాగు చేసి చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ పుట్టగొడుగుల పెంపకానికి మీ దగ్గర 30 నుండి 40 కి చాలా ప్లాట్ లో ఒక రూమ్ ఉంటే చాలు. మార్కెట్లో కంపోస్ట్ కూడా సులభంగా దొరుకుతుంది. 20 నుండి 25 రోజుల్లో పుట్టగొడుగులు పెరగడం మొదలవుతాయి ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగుల ద్వారా కేజీ 100 నుండి 150 పలుకుతుంది. రిటైల్ మార్కెట్లో 200 గ్రాముల పుట్టగొడుగులు ప్యాకెట్ 40 రూపాయల వరకు ఉంటుంది. ఇలా మీరు ఈ వ్యాపారం ద్వారా చక్కగా లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news