బిజినెస్‌ ఐడియా : పూరీలు అమ్మి నెలకు రూ. 5లక్షలు సంపాదిస్తున్న కుటుంబం

-

వైన్‌ షాప్‌ ముందు పానీపూరి బండి ముందు ఎప్పుడూ జనాలు ఉంటారు. ఈ రెండు కష్టమర్స్‌తో కళకళలాడిపోతుంటాయి. మీకు తెలుసా.. ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే చాలు. నిజానికి ఇది కూడా ఒక మంచి బిజినెస్‌ ఐడియానే. అయితే పానీపూరి బండి కాకుండా అందులో వాడే పూరిలు అమ్మి ఓ కుటుంబం నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. మీకు పానీపూరి చేయడం రాకపోతే.. ఇలాంటి వ్యాపారం చేయొచ్చు కదా..! ఇది కూడా మంచి డిమాండ్‌ ఉన్న వ్యాపారమే.. ఈ స్టోరీ గురించి చూద్దామా..!

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మనోజ్ పానీపూరీ అమ్మి లక్షల రూపాయలను అర్జిస్తున్నాడు. పుత్తూరు తాలూకాలోని దారందకుక్కు మానే గ్రామానికి చెందిన మనోజ్‌ని పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను రుచికరంగా అనేక వెరైటీలలో పానీపూరీలను సిద్ధం చేసి ఫుడ్ లవర్స్ కోసం విక్రయిస్తున్నాడు. మనోజ్ 2 సంవత్సరాల క్రితం తన స్వగ్రామం దరందకుక్కుకు తిరిగి రావడానికి ముందు మంగళూరులో 5 సంవత్సరాలు సిటీ బస్సు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇక్కడ ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. పట్టణం అంతటా ప్రయాణీకులను తీసుకువెళుతున్నప్పుడు, పానీ పూరీ దుకాణాలకు ప్రజలు ఎలా క్యూలు కడుతున్నారో గమనించాడు.

ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చాలామంది తమ కిష్టమైన పానీ పూరీ స్టాల్స్‌కి వెళ్లేందుకు ఆయన రిక్షా బుక్‌ చేసుకుంటారు. ఈ పానీ పూరీ అమ్మేవారికి, చాట్ కార్నర్‌లకు వారి రోజువారీ వ్యాపారానికి అవసరమైన పూరీలకు చాలా డిమాండ్ ఉందని అతను గ్రహించాడు. అతను ఈ విషయాన్ని తన తల్లి మోహిని, భార్య ధన్యతో చర్చించి ఇంట్లో పూరీలు తయారు చేసి పానీ-పూరీ అమ్మేవారికి విక్రయించడం ప్రారంభించాడు. అతను ఆటో రిక్షా నడపడం ఆపలేదు. కుటుంబం ప్రతిరోజూ 4 నుండి 5 కిలోల పూరీలను మాన్యువల్‌గా తయారు చేసి కొంత అదనపు డబ్బుకు విక్రయించేవాడు.

డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పూరీ తయారీని ఫుల్‌ టైమ్‌ జాబ్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మనోజ్ కొంత టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే పూరీ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. యంత్రం ఖరీదు రూ.2.9 లక్షలు. కానీ సోలార్ కావడంతో రూ.70వేలు సబ్సిడీ వచ్చింది. యంత్రాన్ని సెల్కో విక్రయిస్తుంది. సబ్సిడీని కూడా పొందేలా కంపెనీ అతనికి మార్గనిర్దేశం చేసింది. అతను తన పెరట్లో ఒక చిన్న పూరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ కనీసం 40 కిలోల పూరీలను తయారు చేసేవాడు. కొన్నిసార్లు, ఈ సంఖ్య ఎక్కువగా కూడా ఉంటుంది. మనోజ్ దగ్గర 7 మంది వ్యక్తులు పని చేస్తున్నారు

అతనికి పూరీలు తయారు చేయడం, ప్యాకింగ్ చేయడం, పంపిణీ చేయడంలో అతనికి సహాయం చేస్తూ కేవలం పుత్తూరుకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన సుల్లియా, సుబ్రమణ్య ప్రాంతాలకు కూడా పని చేస్తున్నారు. పూరీలు అమ్మడం ద్వారా కుటుంబం నెలకు కనీసం 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version