బిజినెస్ ఐడియా: వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్..రైతులకు డబల్ ఆదాయం..

ఈ మధ్య కాలంలో బిజినెస్ చేసేవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.. మంచి లాభాలు ఇచ్చే బిజినెస్ అంటే వ్యవసాయం పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వ్యవసాయ రంగంలో… కొంచెం కష్టపడి పనిచేసి.. విభిన్నమైన పంటలను పండిస్తే.. మంచి లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితే మంచి ఆదాయం ఇచ్చే ఓ పంట గురించి ఇక్కడ తెలుసుకుందాం…

కిన్నో పండ్లు కూడా సిట్రస్ జాతికి చెందినవే. వీటిని మనదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా , జమ్మూ కాశ్మీర్‌లలో ఎక్కువగా పండిస్తున్నారు. అంటే దక్షిణ భారత దేశంతో పోల్చితే ఉత్తర భారతదేశంలోనే అధికంగా సాగు చేస్తున్నారు. సౌత్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో కిన్నో పండ్లను పండస్తున్నారు..వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఎముకల పటిష్టతకు అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కిన్నోవ్ తినడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది..

లోమీ, బంకమట్టి, ఆమ్ల నేలలో సాగు చేయవచ్చు. నీరు సులభంగా బయటకు పోయే ప్రదేశంలో పంటు వేసుకోవాలి. ఒక్కో చెట్టు ఖరీదు దాదాపు రూ.50 వరకు ఉంటుంది. ఒక ఎకరంలో సుమారు 214 కిన్ను చెట్లు నాటవచ్చు. ఒక చెట్టు నుంచి సుమారు 80-150 కిలోల కిన్నో పండ్లు వస్తాయి. ఈ పంటకు 13 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనువుగా ఉంటుంది. 300-400 మిమీ వర్షం సరిపోతుంది. పంట కోత సమయంలో ఉష్ణోగ్రత 20-32 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. కిన్నో మంచి రంగులో ఉన్నప్పుడు కత్తెర సాయంతో కత్తిరించాలి..ఆ తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి.

ఈ పండ్లను బయట మార్కెట్లలో అమ్మవచ్చు..లేదా హోల్ సేల్ షాపు లకు వెయ్యవచ్చు.బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా , ఢిల్లీ వంటి నగరాల్లో కిన్నో పండ్లకు మంచి మార్కెట్ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. శ్రీలంక, సౌదీ అరేబియా ప్రజలు కూడా ఇష్టంగా తింటారు. ఆరెంజ్ పండ్ల సీజన్ ముగిసిన తర్వాత వీటికి డిమాండ్ పెరుగుతుంది..వాటి నాణ్యత బట్టి రేటు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో కిలో కిన్నో పండ్ల ధర రూ.100 వరకు ఉంటుంది..ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను పండిస్తే..ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు.. మీకు ఇలాంటి ఐడియా ఉంటే మీరు కూడా దీని గురించి ఆలోచించండి..