బిజినెస్ ఐడియా: ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్..ఎకరానికి 4 లక్షలు సంపాదన..

ఈ మధ్య ఎక్కువ మంది బిజినెస్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో సెంద్రీయ పద్ధతిలో కాయగూరలను, పండ్లను పండించడం లో ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆర్గానిక్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. అతని సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పంజాబ్ కు చెందిదన అమన్ దీప్ సింగ్ సరావ్ 2017 లో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఒక రోజు తన స్నేహితులతో కలిసి గుజరాత్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.అలా ఫెండ్స్ వెళుతున్న సమయంలో ఓ తోట లో ఎర్రని పండు ఒకటి కాసింది.అది చూడటానికి ఆసక్తిగా ఉందని దాని గురించి ఆరా తీసారు.మార్కెట్‌లో చాలా డిమాండ్‌తో కూడిన విదేశీ పండు అని, ఇది ఆ రైతుకు మంచి లాభాలను సంపాదించడంలో సహాయపడిందని తెలుసుకున్నారు. తరువాత, మరింత సమాచారం కోసం పొరుగున ఉన్న నాలుగు పొలాలను సందర్శించాడు అమన్ సింగ్. పంజాబ్‌లోని తన పొలంలో పండ్ల రకాన్ని తిరిగి ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు.

అలా యూట్యూబ్ లో మరింత సమాచారాన్ని తెలుసుకున్నాడు.డ్రాగన్ ఫ్రూట్ కిలో ధర రూ. 200-225. మహారాష్ట్ర మరియు హైదరాబాద్‌లో సాగు చేస్తున్న కొంత మంది రైతులను అమన్ సందర్శించాడు. అమన్‌ దీప్ ఈ రాష్ట్రాల నుండి మొక్కలను సేకరించి, సాగు కోసం మాన్సా గ్రామంలోని తన పొలంలో రెండు ఎకరాల భూమిని చదును చేసి వాటిని నాటాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతనికి విజయం దక్కలేదు..అలా నాలుగు సార్లు ప్రయత్నాలు చేశాడు.ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే డ్రాగన్ ఫ్రూట్ పండించవచ్చని తెలుసుకున్నాడు అమన్ దీప్. ఆ తర్వాత అమన్‌దీప్ తన విధానాన్ని మార్చుకుని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని ఎంచుకున్నాడు. హర్బంత్ మరియు గుజరాత్ నుండి అప్పటికి స్నేహితులుగా ఉన్న ఇతర రైతుల నుండి మార్గదర్శకత్వం తీసుకున్నాడు.

నేల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి జీవామృతాన్ని ఉపయోగించాడు. మరియు వేపతో పాటు ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాడు. వారి సలహాలు మరియు అమన్ దీప్ ప్రయత్నాలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. పద్దెనిమిది నెలల తరువాత, మొక్కలు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం 12 రకాల డ్రాగన్ ఫ్రూట్ లు పండిస్తూ ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నాడు.ఆ పంటలో వచ్చిన చిన్న మొక్కలను తీసి మళ్ళీ కొత్త ప్రాంతంలో నాటుతూ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేశాడు..ఇప్పుడు అక్కడి రైతులకు ఆదర్సంగా నిలుస్తున్నాడు.