బిజినెస్ ఐడియా: ఇలా టీ షార్ట్ ప్రింటింగ్ బిజినెస్ చేసి మంచిగా లాభాలని పొందండి..!

-

షర్ట్లు కంటే టీ షర్ట్లు వేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అలానే ఈ మధ్య కాలంలో టీ షర్ట్ మీద ప్రింటింగ్ చేస్తున్నారు. దీనికి డిమాండ్ ఎక్కువగా వుంది. సాధారణంగా టీ షర్ట్ మీద ఏదో ఒక ప్రింట్ అనేది ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు టీ షర్ట్ మీద ప్రింట్ చేయించుకుంటున్నారు. కనుక టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ మొదలు పెట్టొచ్చు. టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ మొదలు పెడితే మంచిగా రాబడి వస్తుంది.

మార్కెట్ లో టీ షర్ట్ ప్రింటింగ్ చేసే బిజినెస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనితో బాగా డబ్బులు వస్తాయి. అయితే మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి..?, కావాల్సినవి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. టీ షర్ట్ ప్రింట్ చేయడానికి మొదట మిషన్ కావాలి. మిషన్ ధర 12,000 నుంచి 18 వేలు ఉంటుంది. పెద్ద ఎత్తున టీ షర్ట్లు చేసే మిషన్ అయితే 75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుంది.

మీరు కావాలంటే మంచి ప్లేట్స్ వంటి వాటిపై కూడా ప్రింట్ చెయ్యచ్చు. గిఫ్ట్ ఆర్టికల్ కింద వీటిని ఇవ్వడానికి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బిజినెస్ ని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా కూడా మీరు సేల్ చేయొచ్చు.

ఈ బిజినెస్ చేయడం వల్ల ప్రతి నెల 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ప్రింటింగ్ కోసం పేపర్ కొనాల్సి ఉంటుంది. దీని ఖరీదు 400. సబ్లిమేషన్ టేప్ ఖరీదు 20.0 ప్రింటింగ్ మిషన్ ధర 13,000. ఒక టీ షర్ట్ ని మీరు 30 నుంచి 150 రూపాయలు వరకు అమ్మచ్చు. ఎలా చూసుకున్నా మీకు పెట్టుబడి 50,000 లోపు ఉంటుంది. ఇలా ఈ వ్యాపారం ని మీరు చేసి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఈ వ్యాపారం లో ఎలాంటి రిస్కు కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version