100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సముద్రకని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.

కాగా ఈ చిత్రం జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో “పే పర్ వ్యూ ” పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే.. ఈ సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా నేటికి 100 రోజులను సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు ముస్తాబవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టనుంది. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.