రీ రిలీజ్ కి సిద్ధమైన 7/G బృందావన కాలనీ..!

-

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా 7/G బృందావన కాలనీ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వం వహించగా.. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. ఇక ఈ సినిమా అప్పట్లో యువతను చాలా ఆకట్టుకుంది. 2004లో 7/G రెయిన్బో కాలనీ పేరుతో తమిళంలో ఒక సినిమా విడుదలై అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. అదే ఏడాది తెలుగులో 7/G బృందావన కాలనీ పేరుతో సినిమాను విడుదల చేసి ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతలా ఆకట్టుకుంది అంటే ఇందులో నటీనటులుగా నటించిన రవికృష్ణ , సోనియా అగర్వాల్ అద్భుతంగా తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. యువన్ శంకర్ రాజ అద్భుతంగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ ను దర్శకుడు సెల్వరాఘవన్ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 22వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు యదార్ధ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, అలాగే కొడుకు గురించి ఒక మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తున్నారు.. అన్న అంశాన్ని కూడా ఎంతో భావోద్వేగంగా డైరెక్టర్ చూపించారు. హీరో తండ్రి పాత్రలో చంద్రమోహన్ లీనమైపోయి నటించారనే చెప్పాలి. ఇక ఇందులో సుమన్ శెట్టి కామెడీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది . ఇంత అద్భుతమైన సినిమా మళ్లీ 19 ఏళ్ల తర్వాత థియేటర్లోకి రాబోతుండడంతో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version