Aadavallu Meeku Joharlu : “ఆడవాళ్లు మీకు జోహార్లు” టీజర్ రిలీజ్..సందడి అంతా ఆడవాళ్లదే

-

శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న తాజా సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ ఈ రొమాంటిక్ మూవీ కు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ, సీనియర్ నటి రాధిక అలాగే ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్స్ అందరూ నటిస్తున్నారు.

మొత్తానికి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన, పోస్టర్లు, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు.ఇక ఈ టీజర్ ఆద్యంతం… హీరో శర్వానంద్, రష్మిక మందన పెళ్లి చుట్టే తిరుగుతుంది.

పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతారు ఈ టీజర్ లో చూపించారు చిత్ర దర్శకుడు. మొత్తానికి ఈ సినిమా ఫుల్ అండ్ ఫ్యామిలీ స్టొరీగా ఈ టీజర్ చూస్తే మనకు అనిపిస్తుంది. కాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫిబ్రవరి 25వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version