మళ్ళీ సొంతగూటికి చేరుకుంటున్న అనుపమ ..!

-

అక్కినేని నాగ చైతన్య నటించిన హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది బ్యూటి ఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. శృతిహాసన్ లాంటి నేం అండ్ ఫేం ఉన్న హీరోయిన్ ఉన్నప్పటికి అనుపమ కే ఈ సినిమాలో ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసినప్పటికి స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ దక్కించుకోలేపోయింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన ఒక్క శమానం భవతి తప్ప అనుపమ కెరీర్ లో అద్భుతం అని చెప్పుకునే సినిమాలు లేకపోవడం ఆశ్చర్యకరం. దాంతో అనుపమ కెరీర్ ఏంటో అర్థం కాక అయోమయంలో పడింది. అందం తో పాటు సహజమైన నటనతో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రమే.

అయితే హలో గురు ప్రేమకోసమే ఫ్లాప్ తర్వాత ఇక అనుపమ ఇంటికెళ్ళాల్సిందేనని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది. అయినా అనుపమకి అవకాశాలు మాత్రం దక్కలేదు. అయితే తాజాగా అనుపమ మాతృభాష మలయాళంలో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుపమ టాలీవుడ్ లో మళ్ళీ సొంత గూటికి చేరిందని తెలుస్తోంది. తెలుగులో దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడి సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు అశిష్ హీరోగా దిల్ రాజు నూతన చిత్రానికి సన్నాహాకాలు చేస్తునారట. రీసెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ నచ్చడంతో అదే స్క్రిప్ట్ ని తెరకెక్కించాలని దిల్ రాజు డిసైడయ్యారట. ఇక ఈ సినిమాలో అశీష్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ సరిగ్గా సూటవుతుందని నిర్మాత నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలతో పాటు..అనుపమ గురించి దిల్ రాజు అధికారికగా వెల్లడించనున్నారని లేటెస్ట్ న్యూస్.

 

ఇక ఇంతకముందు దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో అనుపమ శతమానం భవతి సినిమాలో నటించిజాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ తోనే రాజుగారు ఇప్పుడు అనుపమకి దిల్ రాజు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన సినిమాలకి సహ నిర్మాతగా వ్యవరించాడు అశీష్. మరి నిర్మాతగా సెటిల్ అవుతాడనుకుంటే ఇప్పుడిలా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news