అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారియి. నిన్న రాత్రి 8:13 గంటలకు వివాహ బంధంతో ఒక్కటైంది ఈ జంట. హైదరాబాదులోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన ఆలయ నేపథ్య సెటప్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగింది.
నిన్న రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తం సందర్భంగా జరిగిన ఈ పెళ్లి తెలుగు సంప్రదాయాలకు అద్దంపట్టేలా, పెద్దల ఆధ్వర్యంలో ఆచార వ్యవహారాలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహత్తర క్షణాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు తరలివచ్చారు.
ముఖ్యంగా నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్ కూడా హాజరయ్యారు. వివాహ వేడుకకు టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, నటి సుహాసిని, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు హాజరయ్యారు.