ఎవరికైనా ఫాన్స్ ఉంటారు.. నాకు మాత్రం ఆర్మీ ఉంది – అల్లు అర్జున్

-

టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ శ్రీ విష్ణు హీరోగా.. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” అల్లూరి”. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా.. లక్కీ మీడియా బ్యానర్ పై అల్లూరి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీ విష్ణు ఫుల్ లెన్త్ మాస్ రోల్ తో పాటు మొదటిసారి పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇక మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.


ఈ ఈవెంట్ కి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఇక ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ముందుగా ఇక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ కి అలానే శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్, వెల్ విషర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఇక శ్రీ విష్ణు గారి ఫస్ట్ మూవీ ప్రేమ ఇష్క్ కాదల్ లో ఆయన యాక్టింగ్ తనకు విపరీతంగా నచ్చిందన్నారు.

అందుకే అటువంటి గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి మంచి కంటెంట్ కలిగిన మూవీ ని సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ మరింతగా బాగుంటుందని సలహా ఇచ్చాను అన్నారు. అక్కడి నుండి ఆయన చేసిన ప్రతి మూవీ తాను చూసానని, మధ్యలో కొన్ని కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ కూడా ప్రతి సినిమాలో ఆయన నటనని మరింతగా ఇంప్రూవ్ చేసుకుంటూ కొనసాగుతున్నరన్నారు. అంతేకాదు.. ఎవరికీ ఐన ఫాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉందని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version