ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 05న విడుదలైన విషయం తెలిసిందే. అయితే నిర్మాతలు ఒకరోజు ముందే కొన్ని థియేటర్లలలో ప్రీమియర్ షోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రొోడ్డు సంధ్య థియేటర్ లో డిసెంబర్ 04న 9.40కి ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి(39) అనే మహిళ మరణించిన విషయం విధితమే.
దీనిపై ఆమె కుటుంబ సభ్యులు సంధ్య థియేటర్ యజమానిపై, సెక్యూరిటీ హెడ్, అల్లు అర్జున్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే థియేటర్ యజమాని అరెస్ట్ అయ్యారు. తాజాగా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్ మెంట్ తీసుకొని గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం సమయం కావడం.. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో మూడు రాత్రులు అల్లు అర్జున్ జైలులోనే గడుపుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు అల్లు అర్జున్ పై ఏమి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.