చంచల్ గూడలో ముగ్గురు ఖైదీలతో రహస్యంగా అల్లు అర్జున్ మీట్ అయ్యారట. చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్ ఉన్నప్పుడు.. శుక్రవారం రాత్రి ఏం జరిగిందనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ కు డిన్నర్ కోసం జవాన్ కిచెన్ నుంచి పప్పు భోజనం సమకూర్చారట అధికారులు. కానీ రాత్రి భోజనాన్ని నిరాకరించాడట బన్నీ..ఓ గ్లాస్ నీళ్లు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు అధికారులు.
ఇక సాయంత్రం 6.30కు, శనివారం ఉదయం 6గం. కు రోల్ కాల్‌కు హాజరయ్యాడని ప్రకటన చేశారు అధికారులు. ఉదయం ముగ్గురు ఖైదీలతో అల్లు అర్జున్ సంభాషించాడని తెలిపారు జైళ్ళ శాఖ అధికారులు. అనంతరం చంచల్ గూడ నుంచి రిలీజ్ అయ్యాడు హీరో అల్లు అర్జున్. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం కు వెళ్లాడు. అక్కడి నుంచి…నేరు గా ఇంటికి వెళ్లాడు బన్నీ.