రేవంత్ రెడ్డి సర్కార్ పై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆయన మామ, కాంగ్రెస్ పార్టీ నేత చంద్రశేఖర్ స్పందించారు. పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించినప్పుడు ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులు అందర్నీ అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహించారు.
ఎక్కువ మంది గుమీగూడిన చోట ఇలాంటి ఘటనలు జరుగుతే ఎవరిని బాధ్యుల్ని చేస్తారు?? అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టు ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అటు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు కేఏ పాల్. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అంటూ కేఏ పాల్ ఆగ్రహించారు.