రాయల్ లుక్ లో అల్లు స్నేహ రెడ్డి..

-

ఒకప్పటి హీరోలా భార్యలు ఎవరో కూడా బయటకు తెలిసేది కాదు.. వాళ్లు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అవుతూ వచ్చేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం అలా లేదు హీరో భార్య అయినంత మాత్రాన ఇంటికే కట్టుబడి ఉండాలా.. హౌస్ వైఫ్ గానే తమ జీవితాన్ని కొనసాగించాలా అంటూ ఎదురు ప్రశ్నిస్తూ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొనే బాటలో నడుస్తున్నారు కొందరు హీరోల భార్యలు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కోసమే.

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 2011లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు స్నేహ రెడ్డి ఎవరో బయట ప్రపంచానికి తెలియదు. కానీ వివాహమయ్యాక అల్లు అర్జున్ భార్యగా అందరికీ పరిచయమే.. అప్పటినుంచి తన కెరీర్ పై ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానంగా తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు అంటే స్నేహ రెడ్డి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ హీరోయిన్లకు పోటీగా ఫోటోషూట్ లో ఇస్తూ వస్తుంది స్నేహ..

అయితే తాజాగా ఈమె సారీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ లుక్ లో స్నేహ మెస్మరైజ్ చేస్తుండగా నెటిజెన్స్ మాయలో పడిపోతున్నారు. ఈ ఫోటోలు చూసిన వారంతా లైకులు కామెంట్లు చేస్తున్నారు అయితే ఈమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కి ముందు నుంచి మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే కొందరు ఇంత స్టార్ హీరోయియినా భార్య అయి ఉండి ఇంటిలో పద్ధతిగా ఉండాల్సింది పోయి ఇదంతా ఏంటి అంటుంటే మరికొందరు మాత్రం అంత స్టార్ హీరో భార్య ఇలానే ఉండాలి అంటూ స్నేహాను పొగిడేస్తున్నారు అలాగే భర్తకు తగ్గ భార్య అంటూ కితాబు కూడా ఇస్తున్నారు ఏది ఏమైనా స్నేహం మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటూ తన వ్యాపారంలో వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news