మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళితో తన 29వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు తన నటనతో.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో అద్భుతమైన చిత్రాన్ని మనం ముందుకు తీసుకురాబోతున్నారు.
అయితే, రాజమౌళి-మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
మరోపక్క ఈ సినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటించబోతుందని టాక్ నడుస్తోంది. ఆ మధ్య మహేష్ కి విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు రాశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.