తమన్నా స్థానాన్ని లాగేసుకున్న అనసూయ.. అంత రేంజా..?

-

బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు వెండితెర పై సత్తా చాటుతూ దూసుకుపోతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. మిల్క్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీలో 17 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ హోదాను ఏమాత్రం తగ్గించకుండా అదే స్థాయిలో దూసుకుపోతున్న తమన్నా కు టార్గెట్గా నిలిచింది అనసూయ.

అసలు విషయంలోకి వెళితే.. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎన్ బీ కే 108 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు. అందులో భాగంగానే తమన్నాను తీసుకోవాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్టుబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోయిన్లను ఐటమ్ సాంగ్ లో పెడితే సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుందని ఆయన ఆలోచించారు. కానీ తమన్నా మాత్రం ఐటమ్ సాంగ్ లో చేయాలి అంటే తనకు కోటిన్నర రూపాయల పారితోషకం ఇవ్వాలని పట్టు పట్టిందట.

అయితే దీనికి అనిల్ రావిపూడి ఒప్పుకున్నా సరే నిర్మాతలు ఐటమ్ సాంగ్ కోసం అంత డబ్బు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అంతే క్రేజ్ , ఫేమ్ ఉన్న అనసూయను ఇప్పుడు బాలయ్య పక్కన ఐటమ్ సాంగ్ లో చేయడానికి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే తమన్న స్థానాన్ని కూడా అనసూయ లాగేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version