Big Boss OTT : ‘బిగ్ బాస్’లో యాంకర్ సుమ సుందడి..కంటెస్టెంట్స్‌పై ‘జయమ్మ’ పంచులే పంచులు..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్‌లో యాంకర్ సుమ సందడి చేసింది. ఉగాది సందర్భంగా హౌస్ లోకి వెళ్లిన సుమ.. అక్కడ రచ్చ రచ్చ చేసింది. తనదైన స్టైల్ లో పంచులు వేసి కంటెస్టెంట్స్ ను ఓ ఆటాడుకుంది రాజీవ్ కనకాల భార్య.

యాంకర్ సుమ ఇన్నాళ్ల పాటు బుల్లితెరపై మహారాణిగా కొనసాగింది. కాగా, త్వరలో ఈమె వెండితెరపైన అలరించబోతున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ చేసింది.

‘జయమ్మ’గానే కాకుండా సూర్యకాంతమ్మగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన సుమ..కంటెస్టెంట్స్ పైన పంచులు వేస్తూ వారిని నవ్వించింది. బిగ్ బాస్ ప్రతీ సీజన్ కు తనకు ఆహ్వానం అందుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.

‘బిగ్ బాస్’ సుమకు వెల్ కమ్ చెప్పగా, కంటెస్టెంట్స్ సుమను చూసి కేరింతలు కొట్టారు. అలా ఇద్దరు ముగ్గురి మధ్య నలిగిపోయావంటూ బిందు మాధవిని ఉద్దేశించి యాంకర్ సుమ కామెంట్ చేసింది. మిత్ర అలా అప్పడం మాదిరిగా విరిగిపోయిందంటూ చెప్పింది. ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూనే కంటెస్టెంట్స్ పైన యాంకర్ సుమ తన దైన శైలిలో పంచులు వేసింది.

ఓటీటీ షో అయిన నేపథ్యంలో తాను కూడా సెన్సార్ లేకుండా మాట్లాడేస్తున్నాననంటూ తనపైన తానే పంచులు వేసుకుని నవ్వులు పూయించింది సుమ. ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంలో సుమ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో గయ్యాళీగా సుమ కనిపించబోతున్నదని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ మూవీకి విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news