“గాడ్ ఫాదర్” నుంచి మరో పవర్ఫుల్ డైలాగ్ రిలీజ్

-

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం విడుదలవ్వడానికి కేవలం కొద్ది సమయం మాత్రమే ఉన్నది. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా మరో పవర్ఫుల్ డైలాగ్ ను రిలీజ్ చేశారు.

” కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ” అంటూ సాగే ఈ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. మూవీలోని డైలాగ్స్ షేర్ చేస్తూ వినూత్నంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు డైలాగులకు మంచి స్పందన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news