BREAKING : మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి అరెస్ట్‌ వారెంటు !

-

BREAKING : టాలీవుడ్‌ సినీ నటి, మంత్రి రోజా కు ఊహించని షాక్‌ తగిలింది. సినీ నటి, మంత్రి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణికి అరెస్టు వారెంటు జారీ అయింది. ఈ మేరకు తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణికి అరెస్టు వారెంటు జారీ చేసింది చెన్నై జార్జిటవున్ కోర్టు.

2016లో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్చరసుతో కలిసి ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారంటూ జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా కేసు వేశారు ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా.

అయితే.. ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరు కావడంతో సెల్వ మణికి అరెస్టు వారెంట్ జారీ చేసిన చెన్నై జార్జిటవున్ కోర్టు. మరి దీనిపై సినీ నటి, మంత్రి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version