అంత మంది తిరస్కరించాకే రాజేంద్రపసాద్ వద్దకు ‘ఆ నలుగురు’ చిత్రం..!

-

టాలీవుడ్ హాస్య చిత్రాలకు కేరాఫ్ రాజేంద్రప్రసాద్ అని చెప్పొచ్చు. హాస్యశిఖరంగా పేరు గాంచిన రాజేంద్రప్రసాద్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఆ నలుగురు’ సొసైటీని ఆలోచింపజేసింది. అప్పటి వరకు ఉన్న సినిమాల్లో భిన్నమైన చిత్రంగా నిలిచి, విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే, ఆ సినిమాను చాలా మంది ప్రముఖులు తిరస్కరించిన తర్వాతనే రాజేంద్రప్రసాద్ వద్దకు వచ్చింది. ఎంత మంది ఈ మూవీ స్టోరిని రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం.

రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా స్టోరిని మదన్ రెడీ చేసుకున్నారు. తొలుత ఈ పిక్చర్ కు ‘అంతిమయాత్ర’ అనే టైటిల్ ను అనుకున్నారు మదన్. కానీ, చివరకు అది ‘ఆ నలుగురు’గా మారింది. ఇందులో ఆదర్శవంతమైన వ్యక్తి పాత్రను రాజేంద్రప్రసాద్ పోషించారు. తొలుత దీనిని సీరియల్ గా తీయాలనుకుని ఈటీవీ వారికి ఈ కథ వినిపించారు మదన్. కానీ, వారు ఒప్పుకోలేదు.

ఆ తర్వాత డైరెక్టర్ రామ్ ప్రసాద్ కు ఈ స్టోరి వినిపించారు. దర్శక రత్న దాసరి నారాయణరావుతో ఈ మూవీ చేయాలనుకున్నారు దర్శకుడు రామ్ ప్రసాద్. ఒక వేళ ఆయన ఒప్పుకోకపోతే మోహన్ బాబుతో అయినా ఈ ఫిల్మ్ చేయాలనుకున్నారు. కానీ, వారిరువురు రిజెక్ట్ చేశారట. అలా చివరకు ఈ సినిమా స్టోరిని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కు వినిపించారు.

ఈ ఫిల్మ్ స్టోరి విన్న ప్రకాశ్ రాజ్ ..పిక్చర్ కంటే కూడా నవలగా బాగుంటుందని అన్నారట. చివరకు ఈ సినిమా స్టోరి రైట్స్ ను దర్శక నిర్మాత చందు సిద్ధార్థ్ కొనుగోలు చేశారు. స్టోరిని రాజేంద్రప్రసాద్ కు వినిపించగా, ఆయన ఓకే చేసి వెంటనే చేసేద్దాం అన్నారు. అలా ఈ మూవీ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news