Bholaa Shankar : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…”బోళా శంకర్‌” నుంచి చిరు ఫస్ట్ లుక్ రిలీజ్

-

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. మోహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది.అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి మెగాస్టార్‌ చిరంజీవి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ మేరకు చిత్ర బృందం ఓ వీడియో ను విడుదల చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి..త్రీ శూలం ఉన్న చైన్ తో..  ఓ జీపులో కూర్చుని ఉన్నారు.  ఇక ఈ ఫస్ట్ లుక్ ను చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news