తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ గేమ్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. సదరు ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాగార్జున సూపర్బ్ ఎంట్రీతో ఎపిసోడ్ స్టార్ట్ అయింది.
‘ఎఫ్ 3’ ఫిల్మ్ టీమ్ ..మెహ్రీన్ పిర్జాదా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ‘మేజర్’ ఫిల్మ్ టీమ్..హీరో అడివి శేష్, హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున సరదా సంభాషణలు హైలైట్ అయ్యాయి. అనిల్ రావిపూడి ఫేవరెట్ హీరోయిన్ మెహ్రీన్ ..అని నాగార్జున సరదాగా అడిగాడు. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఆడియన్స్ గా వచ్చారు.
ఇక ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పే క్రమంలో నాగార్జున ఫైవ్..ఫోర్..త్రీ..టూ..వన్ అంటూ కౌంట్ డౌన్ చెప్పడం స్టార్ట్ చేశాడు. అంతటితో ప్రోమో ముగిసింది. అలా ‘బిగ్ బాస్’ ప్రోమో ఎండ్ అయింది. ఇంతకీ హౌజ్ లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే శనివారం సాయంత్రం 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT లో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.