బిగ్ అప్డేట్: సంక్రాంతి బరిలో “వాల్తేరు వీరయ్య”

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల చిరంజీవి 153 వ సినిమాగా వచ్చిన గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చిరు తన 154 వ సినిమా అయిన “వాల్తేరు వీరయ్య”ను విడుదలకి సిద్ధం చేస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కనుంది.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. కోన వెంకట్, చక్రవర్తి స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ సినిమాకి హరి మోహన్ కృష్ణ, వినీత్ పోట్లూరి రచన సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని బాబీ తెరమీద ప్రజెంట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైపోయినట్లుగా మేకర్స్ అప్డేట్ వదిలారు.

సాధారణంగా మూవీ షూటింగ్ ముగింపు దశకి చేరుకున్న తరువాతనే డబ్బింగ్ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. అందువలన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగడం ఖాయం అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తూర్పుగోదావరి యాసతో పవర్ఫుల్ డైలాగ్స్ తో చిరంజీవి ఈ మూవీలో ఆకట్టుకుంటాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news