బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

-

తొలి వారం చప్పగా సాగిన బిగ్ బాస్ షో రెండో వారం నుంచి పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుతున్నాయి. తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫ్లాప్ అయినా అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆకట్టుకున్నాయి. టాస్కుల వల్ల హౌస్ లో ఎవరి స్ట్రాటజీలు ఏంటో అవతలి వాళ్లకు సులభంగా అర్థమవుతున్నాయి. మార్నింగ్ మస్తీలో స్వాతి నవరసాలను నేర్పించాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

స్వాతి శృంగార రసంలో భాగంగా అభిజిత్ ను లవ్ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్ మొదలైందనే చెప్పాలి. ఇప్పటికే అభిజిత్, మోనాల్ మధ్య ఏదో ఉందనే గుసగుసలు బలంగా వినిపిస్తుండగా స్వాతి ప్రపోజ్ చేయడంతో ఇకపై అభిజిత్, స్వాతి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపించే అవకాశం ఉంది. కోపంలో భాగంగా లాస్య, నోయల్ గొడవ పడుతున్నట్టు కనిపించగా.. ఏడుపులో స్వాతి మొదట ఏడ్చేసింది.

అవిగాష్ పై గంగవ్వ గట్టిగా అరిచి భీభత్స రసం చూపించింది. ఇకపోతే అవినాష్ మోనాల్ కు దగ్గర కావాలని భావిస్తూ సరదాగా అమ్మ గుర్తొస్తోందని చెప్పాడు. దీంతో అఖిల్ వెంటనే మోనాల్ అవినాష్ అక్కాతమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్ చేశారు. ఆ తరువాత అఖిల్, సొహైల్ లను బిగ్ బాస్ హిట్ మేన్ డ్రెస్సులు వేసుకోవాలని సూచించాడు. హొట్ మేన్ లకు 5 వేలు ఇంటి సభ్యులకు 10 వేలు ఇచ్చి బజర్ మోగిన సమయంలో లాంజ్ లోకి ఎవరు వస్తే వాళ్లు హిట్ మెన్ లతో మర్డర్ డీల్ చేసుకునే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

అమ్మ రాజశేఖర్ స్వాతి దీక్షిత్ ను, మెహబూబ్ అభిని, అరియానా లాస్యను, హారిక మెహబూబ్ ను, సుజాత కుమార్ సాయిని, సొహైల్ అఖిల్ లలో సొహైల్ దగ్గర తక్కువ డబ్బు ఉండటంతో అతను నామినేట్. బిగ్ బాస్ అఖిల్ కు ఒకరిని నామినేట్ చేసే అవకాశం అవకాశం కల్పించగా హారికను నామినేట్ చేశాడు. స్వాతి, అభిజిత్‌, లాస్య, హారిక, కుమార్‌సాయి, సోహైల్‌, మెహబూబ్ నామినేట్ కాగా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news