బిగ్ బాస్ లో గత మూడు రోజుల నుంచి అడవిలో ఆట అనే ఆటను కంటెస్టెంట్లు అందరూ చాలా సంతోషంగా పూర్తి చేశారు. ఇందులో దొంగల టీం, పోలీస్ టీం గా విడిపోయి చివరికి రెడ్ ట్యాగ్స్ ఎక్కువగా ఉన్న బొమ్మలను సొంతం చేసుకుని పోలీస్ టీం విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలోని పోలీస్ టీం నుంచీ ఆట ఆడిన ఇనయ సుల్తానా తన డ్రెస్ లేపారు అంటూ ఎమోషనల్ అయింది. ఇకపోతే అడవిలో ఆట టాస్క్ జరుగుతున్న సమయంలో రెండవ రోజు టాస్క్ రూల్స్ చెప్పి మరీ ఆడమన్నాడు బిగ్ బాస్. మొదట పిట్టల సౌండ్ రాగానే దొంగలు అడవిలో దోచుకోవడం మొదలుపెడతారు. ఇక పోలీసులకు చిక్కకుండా రెడ్ ట్యాగ్ ఉన్న బొమ్మలను దోచుకున్నారు. తర్వాత విజిల్ సౌండ్ వినిపించింది.. దీంతో పోలీస్ టీం హౌస్ లో సోదాన్ని నిర్వహించారు. ఇందులో ఇనయా, ఫైమా, చంటి బెడ్ రూమ్ ని ఎంచుకోవడం జరిగింది.
ఇక బెడ్ రూమ్ డోర్ దగ్గర హాల్ వైపు ఉన్న నేహాను ఇనయ టార్గెట్ చేసింది. కానీ దొంగల ముఠా నాయకుడు సూర్య గట్టిగా చెప్పడంతో వదిలేసింది. ఆ తర్వాత లగేజ్ రూమ్ లో సోదా చేసేందుకు వెళ్ళింది ఇనయ.. ఇక అక్కడ ఇనయ రాంగ్ గేమ్ ఆడుతుందని సూర్య హెచ్చరించాడు. అక్కడే ఇనయా సుల్తానా పై నలుగురు అమ్మాయిలు వచ్చి పడ్డారు. బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే నేహాను తోసేస్తూ మెడను బలంగా పట్టుకుంది ఇనాయ.. దీంతో నేహా బాగా హర్ట్ అయింది. అంతేకాదు ఇనయాన్ని కీర్తి , వాసంతి, సుదీప , ఆరోహి గట్టిగా పట్టుకున్నారు. నేహా కూడా ఒకవైపు బలంగా ఒడిసి పట్టుకుంది. ఇక వారందరి నుంచి తనను తాను విడిపించుకునే ప్రయత్నం చేసే సమయంలో ఇనయ డ్రెస్ పైకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని ఇనయ చెప్పింది . కానీ నేహా మాత్రం ఇనయా పై కంప్లైంట్ చేసింది.
అంతేకాదు నన్ను లాగిపెట్టి చెంప మీద కొట్టిందని పోలీస్ టీం కి కంప్లైంట్ చేసింది. ఇనయా గట్టిగా కొట్టిందని అందుకే మేము అందరం కలిసి పట్టుకున్నామని కూడా చెప్పింది.. నిజానికి ఇనయ తప్పించుకునే ప్రయత్నంలో అందరితోనూ కలబడింది.. కానీ కావాలని చెంప మీద కొట్టలేదు .కేవలం మెడ దగ్గర బలంగా పట్టుకుంది.. కానీ ఇనయాను రెడ్లైన్ దాటించి మరీ దొంగలు కిడ్నాప్ చేశారు.. ఇక అలా రెండు టీం లు పరస్పర గొడవలు చేసుకుంటూ ఫైనల్ గా ఆటను ముగించారు. ఇక ఇందులో కెప్టెన్ గా ఆదిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది.