‘బాలీవుడ్ నన్ను ఓ మూలాన పడేసింది అక్కడ రాజకీయాలు నావల్ల కాలేదు..’ ప్రియాంక చోప్రా

-

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా బాలీవుడ్ పై వైరల్ కామెంట్స్ చేశారు. తాను బాలీవుడ్ ను వదిలి హాలీవుడ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన ప్రియాంక చోప్రా కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ సుందరి కిరీటాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత మోడల్ గా, నటిగా తన కెరీర్ను కొనసాగించారు. కాగా ప్రియాంక చోప్రా తన సినీ ఆరంగేట్రం బాలీవుడ్ సినిమాతో జరిగిందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఆమె తన మొదటి సినిమా తమిళ్ స్టార్ హీరో విజయ్ తో నటించారు. అనంతరం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు.

Priyanka Chopra recovering after mishap on 'Quantico' set - Stabroek News

అలా దాదాపు పది ఏళ్ల పాటు బాలీవుడ్లో తన ప్రస్థానాన్ని కొనసాగించిన ప్రియాంక చోప్రా 2015లో హాలీవుడ్ లో అడుగు పెట్టారు. అప్పటి నుంచి బాలీవుడ్కు గుడ్ బాయ్ చెప్పేశారు. అయితే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తను బాలీవుడ్ ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ లో తనను ఒక మూలన పడేసారని అంతేకాకుండా కొందరితో విభేదాలు తనకు చాలా ఇబ్బంది కలిగించాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ ఉన్న రాజకీయాలతో తాను చాలా విసుగిపోయానని అలాంటి రాజకీయాలు చేయటం తన వల్ల కాలేదని తెలిపారు. అందుకే బాలీవుడ్ నుండి పూర్తిగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని అక్కడ బ్రేక్ తీసుకొని హాలీవుడ్ కి వచ్చేసాను అని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version