బాలీవుడ్ ‘విక్రమ్‌వేద’ ట్రైలర్ రిలీజ్.. గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్ లుక్ అదుర్స్

-

తమిళ్‌లో సూపర్ హిట్ అయి కేవలం తమిళ ప్రేక్షకులకే కాదు దక్షిణాది ఆడియెన్స్‌ని ఉర్రూతలూగించిన విక్రమ్‌వేద సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. బాలీవుడ్‌ నటులు హృతిక్‌ రోషన్‌, సైఫ్ అలీఖాన్‌ కలిసి నటించిన సినిమా ఇది.

ఇందులో.. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌, గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌ కనిపించారు. ఇద్దరి నటన కట్టిపడేసేలా ఉంది. హృతిక్‌ రోషన్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాతృకకు దీటుగా ఈ రీమేక్‌ చిత్రం తెరకెక్కిన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. “ప్రతి కథలో మంచీ చెడూ ఉంటాయి. కానీ, ఇది ఇద్దరు చెడ్డవారి కథ” అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘విక్రమ్‌ వేద’కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఈ హిందీ సినిమాకూ దర్శకత్వం వహించింది. ఎస్‌. శశికాంత్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. రాధికా ఆప్టే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news