ఆ సంవత్సరం బాక్సాఫీసు వద్ద అన్నిసార్లు తలపడ్డ ఎన్టీఆర్, కృష్ణ.. ఎవరు నెగ్గారంటే?

నటరత్న నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్)ను తెలుగు ప్రజలు ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయితే జనం థియేటర్లకు వెళ్లి సంబురాలు చేసుకుంటారు. 1979వ సంవత్సరంలో అన్న ఎన్టీఆర్ నటించిన సినిమాలకు పోటీగా నటశేఖర కృష్ణ నటించిన పిక్చర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిరువురు బాక్సాఫీసు వద్ద తలపడ్డారు. అందులో ఎవరి సినిమాలు విజయం సాధించాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1979వ సంవత్సరంలో జనవరిలో ఇద్దరు సూపర్ స్టార్స్ అనగా కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిక్చర్ యావరేజ్ గా నిలవగా, ఎన్టీఆర్ ‘డ్రైవర్ రాముడు’ ఫిల్మ్..బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ..కమర్షియల్ గా బాగా సక్సెస్ అయి వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత మాసంలో కృష్ణ నటించిన ‘వియ్యాల వారి కయ్యాలు’ విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన ‘మా వారి మంచతనం’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక కృష్ణ నటించిన ‘దొంగలకు సవాల్’..ఎన్టీఆర్ నటించి స్వీయ దర్శకత్వం వహించిన ‘శ్రీమద్విరాట పర్వం’..రెండూ బాక్సాఫీసు వద్ద యావరేజ్ గా నిలిచాయి. కృష్ణ నటించిన ‘ఎవడబ్బ సొమ్ము’, ‘బుర్రిపాలెం బుల్లోడు’..రెండు చిత్రాలూ..ఎన్టీఆర్ ‘వేటగాడు’,‘శృంగార రాముడు’ పోటాపోటీగా విడుదలయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ ‘వేటగాడు’ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మొత్తంగా ఎన్టీఆర్, కృష్ణ సినిమాల మధ్య బాక్సాఫీసు వద్ద ఐదు సార్లు తలపడ్డాయి. అందులో ఒకరికి ఒకసారి పై చేయి కాగా మరొకరిది మరోసారి పై చేయిగా నిలిచింది.