కృష్ణ గారి మనసు హిమాలయ పర్వతం – చిరంజీవి

కృష్ణ గారి మనసు హిమాలయ పర్వతం అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం, వీటి కలబోత కృష్ణ గారని తెలిపారు.

అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే ఆరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రునివాళి ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియచేసుకుంటున్నానని వెల్లడించారు చిరంజీవి.