క్లాప్స్‌, జేజేలు కొట్టే సినిమాలు మాత్రమే చేస్తాను – చిరంజీవి

-

మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లాప్స్‌, జేజేలు కొట్టే సినిమాలు మాత్రమే చేస్తానన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లు నాకు వస్తె నేను చెయ్యనని… ఏమి చేస్తే క్లాప్ కొడతారు … జే జే లు కొడతారు అనేది నేను చూస్తానని వెల్లడించారు.

అలాంటి సినిమాలు చేస్తానని పేర్కొన్నారు చిరు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవికి పానీపూరి తినిపించారు అమీర్ ఖాన్. అటు అమీర్ ఖాన్ తో తెలుగు డైలాగు చెప్పారు నాగచైతన్య.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. కానీ అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయని… అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు. అమీర్ ఖాన్ లాగా మేం చేయాలనుకుంటాం, మాకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నామని చెప్పారు. స్క్రిప్ట్ మీద అవగాహన కోసం వర్క్ షాప్ లు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version