మరో సారి నవ్వులు పూయించేందుకు రణ్‌వీర్ సింగ్ రెడీ..‘జయేశ్ భాయి’ని మించి..

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ నటించిన ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ఫిల్మ్ ట్రైలర్ ఇటీవల విడుదలై సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెరీ ఫన్నీ యాక్టింగ్ తో రణ్ వీర్ సింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించబోతున్నాడన్న సంగతి ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

‘జయేశ్ భాయ్ జోర్దార్’ పిక్చర్ ఈ నెల 13న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా సంగతి అలా ఉండగానే, మరో కీలక ప్రకటన చేశాడు రణ్ వీర్ సింగ్. తను నటిస్తున్న మరో కామెడీ ఫిల్మ్ రిలీజ్ డేట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ‘సర్కస్’ ఫిల్మ్ గురించి ప్రకటన చేశారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రోహిత్ శెట్టి ‘సర్కస్’ వరల్డ్ చూసేందుకు ప్రతీ ఒక్కరు రెడీగా ఉండాలని సూచించారు. ఇది ‘గోల్ మాల్’ సిరీస్ లానే ఉంటుందని వార్తలొస్తున్నాయి. కాగా, అంతకుమించి న ఎంటర్ టైన్మెంట్ ను అందించబోతున్నట్లు మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.