క్రేజీ న్యూస్.. బింబిసార-2 లో బాలయ్య నటించబోతున్నాడా..?

-

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వచ్చిన చిత్రం బింబిసార. ఈ చిత్రం మొదటి నుంచి మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా బింబిసారా -2 రాబోతున్నట్లు సమాచారం. అయితే డైరెక్టర్ వశిష్ట బింబిసార చిత్రం కంటే ముందుగా మెగా హీరో అల్లు శిరీష్ తో కూడా ఒక సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయవలసి ఉందట. కానీ కొన్ని కారణాల చేత ఆ చిత్రం ఆగిపోయింది.అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ వశిష్ట తో ఆ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ వర్గాల వారు భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా బింబిసార -2 సినిమా విషయంలో కూడా బాగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఏ చిత్రం ముందుగా మొదలు పెడతారో చూడాలి. మరొకవైపు బింబిసార చిత్రాన్ని చేసిన బాలయ్య వశిస్ట ను ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అదే సమయంలో తప్పకుండా తనతో కలిసి ఒక సినిమా చేద్దామని హామీ కూడా ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అభిప్రాయాన్ని బాలయ్య అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక అంతే కాకుండా బింబిసారా -2 లో బాలయ్యకు ఏదైనా పాత్ర సెట్ అయితే కచ్చితంగా నటించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.Balakrishna Watches Bimbisara: Natasinham praised Kalyan Ram..!ఇక కళ్యాణ్ రామ్,బాలకృష్ణ కలిసి నటించాలని వీరిద్దరి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక బింబిసార-2 సినిమా కనుక నందమూరి అభిమానుల కోసం మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ చిత్రం బిగ్గెస్ట్ గా నిలిచింది. మరి ఈ సినిమా సీక్వెల్స్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news