హీరో కంటే ఆర్టిస్టే గొప్ప.. తెలుగు స్టార్ హీరోలపై దాసరి నారాయణరావు కామెంట్స్..!

-

దివంగత దర్శకులు, దర్శక రత్న దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ పెద్దగా ఆయనను ప్రతీ ఒక్కరు గౌరవించారు. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు..బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, స్టోరి రైటర్ గా, సాంగ్ రైటర్ గా అన్ని విభాగాల్లో పని చేశారు. ఎంతో మంది కొంత వాళ్లను వెండితెరకు పరిచయం చేసిన ఘనత దాసరికి దక్కింది.

దాసరి నారాయణ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసిన వాళ్లు ఆ తర్వాత కాలంలో స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. సినిమాలోని 24 క్రాఫ్ట్స్ పైన పట్టున్న వ్యక్తిగా దాసరి నారాయణరావు ఉన్నారు. ఆయన దర్శకత్వంలో, రామానాయుడు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘సూరిగాడు’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలు పంచుకుంటూనే అప్పటి స్టార్ హీరోలపైన దాసరి నారాయణ రావు చేసిన కామెంట్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం.

‘సూరిగాడు’ చిత్రంలో దాసరి నారాయణరావు నటించారు కూడా. ఈ చిత్ర క్లైమాక్స్ చూసి జనాలు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్ర విశేషాలు పంచుకుంటున్న క్రమంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు దాసరి సమాధానాలిచ్చారు.

ఈ క్రమంలోనే అప్పటి స్టార్ హీరోల గురించి తన అభిప్రాయం చెప్పారు. చిరంజీవి ‘స్టార్ హీరో’ అని పేర్కొన్న దాసరి..కేవలం పోస్టర్ ద్వారా థియేటర్ కు ఆడియన్స్ ను రప్పిస్తున్న స్టార్ హీరో చిరంజీవి అని తెలిపారు.

ఇక మోహన్ బాబు ‘గ్రేట్ ఆర్టిస్ట్’..అని చెప్పిన దాసరి..డైలాగ్స్ చెప్పడంలో మోహన్ బాబుది ప్రత్యేకమైన శైలి అని కొనియాడారు.

హీరో కంటే ఎప్పుడూ ఆర్టిస్టే గొప్పని అన్నారు. బాలయ్య ‘అందమైన నటుడని’, కొన్ని పాత్రలు ‘రాజశేఖర్’కు మాత్రమే సాధ్యమని చెప్పిన నారాయణరావు..నాగార్జున ‘తెలివైన నటుడ’ని, ‘హాస్యానికి’ కేరాఫ్ రాజేంద్రప్రసాద్ అని చెప్పుకొచ్చారు. అలా ఆనాటి స్టార్ హీరోల గురించి దాసరి కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news