తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం పనైయుర్, ఈసీఆర్ రోడ్డులోని విజయ్ హెల్ ఆఫీస్ లో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ప్రభాకరన్ అనే పేయింటర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఆఫీస్ పేయింట్ చేయటానికి ప్రభాకరన్ ఓ నెల రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కొద్ది రోజుల కింద కుటుంబ సభ్యులను కలవడానికి ప్రభాకరణ్ ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి వచ్చాడు.
ఆ టైంలో ఫుల్లుగా తాగి ఉన్న అతడు పరాటా తినటానికి వంద రూపాయలు కావాలని సూపర్ వైజర్ ను అడిగాడు. సూపర్ వైజర్ రూ.100 ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రభాకరణ్ చనిపోయి కనిపించాడు. అతడి నోట్లో అలాగే.. చేతిలో పరోటా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.