అల వైకుంఠపురంలో డిలీట్ సీన్ రిలీజ్ ..!

-

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన చిత్రం అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ తో కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా అల వైకుంఠ పురములో. చిత్ర విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ పొందాయి.

Allu Arjun in Ala Vaikuntapuram Lo movie

ఈ మూవీ లోని రాములో రాముల పాట కుర్రకారుని ఒక ఊపు ఉపింది. ఈ సినిమాలో హీరో సుశాంత్ ఓ కీలకపాత్రను పోషించారు. ఈ సినిమా అల్లు అర్జున్ కు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ను అందించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన బన్నీ కి సుశాంత్ కు మధ్య సరదాగా జరిగే ఒక డిలీటెడ్ సీన్‌ను ఈ మధ్య చిత్రయూనిట్ సోషల్ మీడియా లో విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సినిమా లో సుశాంత్ పాత్ర పేరు రాజు, రాజు తాగుతున్నప్పుడు (బన్నీ పాత్ర) బంటి వీడియో తీసి, దానిని ‘అర్జున్ రెడ్డి 2’గా షార్ట్ పిల్మ్ తీస్తున్నానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం దాంతో నీకేం కావాలి అని రాజు, బంటిని అడుగడం వెంటనే ఆఫీస్‌కు బస్సులో వెళ్లేందుకు రాజు పరిగెత్తడం, వెనుక కారులో బంటి వీడియో తీస్తుంటే ఇదంతా చూస్తూ అదే కారులో ఉన్న వాల్మీకి అల్లాడిపోతుండటం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. అయితే సినిమాలో లేని ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా హల్ చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news