అల్లు అర్జున్ కు మరో షాక్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హైదరాబాద్ కు వచ్చి..ఏపీకి వెళ్లిపోయారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్….ఈ రోజు ఉదయం విజయవాడకి తిరిగి వెళ్లిపోయారు. ఇందులో భాగంగానే… గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మరికొద్దిసేపట్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళి అర్పించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి బయలుదేరి వెళతారట. అయితే.. హైదరాబాద్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఇప్పటికీ అల్లు అర్జున్ కలిసి పరామర్శించలేదు. మళ్లీ ఏపీకి తిరిగి వెళ్లిపోయారు. దీంతో అల్లు కుటుంబం షాక్ లో ఉంది.