BREAKING : గీతా ఆర్ట్స్ ముందు నగ్నంగా కూర్చుని మహిళా ఆర్టిస్టు ధర్నా

-

టాలీవుడ్‌ పరిశ్రమ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ కు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న గీత ఆర్ట్స్ ముందు నగ్నంగా కూర్చుని ఒక మహిళా ఆర్టిస్టు ధర్నాకు దిగింది. ఈ మహిళ ఆర్టిస్టు పలుమార్లు గతంలో ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేశారు.. గీతా ఆర్ట్స్ వారు తనకు డబ్బులు ఇయ్యాలి అంటూ ఈ ధర్నా చేసింది ఆ మహిళా.

ఎన్ని సార్లు డబ్బులు అడిగినా.. తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధిత మహిళ. ఈ నేపథ్యంలోనే.. తాజాగా గీత ఆర్ట్స్ ముందు నగ్నంగా కూర్చుని ధర్నా చేసింది బాధిత మహిళ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఆ మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తీసుకు ని పోయే సమయంలో… మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version