‘బ్రహ్మాస్త్ర’ వివాదంపై స్పందించిన డైరెక్టర్..రణ్‌బీర్ చెప్పులతో అలా వెళ్లడంపై వివరణ

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటించిన విజ్యువల్ గ్రాండియర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ పార్ట్ వన్ ట్రైలర్ ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. కాగా, ఈ ట్రైలర్ లో కొన్ని సీన్లపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

‘శివ’ పాత్ర పోషిస్తున్న రణ్ బీర్ కపూర్..ఓ గుడిలోకి షూస్ వేసుకుని ఎంట్రీ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పలువురు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అనే హ్యాష్ ట్యాగ్ నూ మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో కొందరు నెటిజన్లు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. కాగా, తాజాగా ఈ వివాదంపై ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు.

రణ్ బీర్ కపూర్ కాళ్లకు షూస్ వేసుకుని వెళ్లింది టెంపుల్ లోకి కాదని, దుర్గాదేవీ పూజా మండపంలోకి మాత్రమేనని అయాన్ తెలిపారు. 75 ఏళ్లుగా తమ కుటుంబం దుర్గాదేవీని పూజిస్తోందని, తాము మండపంలోకి చెప్పులు ధరించి వెళ్తామని, కానీ, అమ్మవారి ముందుకు అలా వెళ్లబోమని చెప్పాడు. చెప్పులు తీసేసిన తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకుంటామని చెప్పుకొచ్చిన అయాన్..భారతీయ సంస్కృతిని చాటి చెప్పేందుకు ఈ చిత్రాన్ని తీసినట్లు స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

 

Read more RELATED
Recommended to you

Latest news